ఇక్కడ వ్యాక్సిన్ వేయించుకుంటే మహిళలకు ముక్కుపుడక ఫ్రీ – మరి ఫురుషులకి ఏమిటంటే

0
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి .. ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నా కేసుల సంఖ్య మాత్రం భారీగా నమోదు అవుతోంది..   కొందరు వ్యాక్సిన్ కు దూరంగా ఉంటున్నారు. మరికొందరు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.
అయితే వ్యాక్సిన్ వేయించుకునేలా చేయించేందుకు గుజరాత్ లో ని సూరత్లో అక్కడి బంగారు వ్యాపారుల సంఘం అదిరిపోయే ఆఫర్ తెచ్చింది.
ఎవరు వ్యాక్సిన్ వేయించుకుంటారో ఆ మహిళలకు ఉచితంగా ముక్కు పుడక ఇస్తాము అని ప్రకటించారు, ఇక
పురుషులు వ్యాక్సిన్ వేయించుకుంటే హ్యాండ్ బ్లెండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పింది… ఇక వ్యాక్సిన్ తీసుకున్న వారు చాలా మంది మరికొందరికి కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోండి అని చెబుతున్నారు.
మొత్తానికి కరోనా వ్యాక్సిన్ పై తాజాగా ఇక్కడ వారు తీసుకున్న నిర్ణయంతో భలే ఉంది ఈ డెసిషన్ అంటున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎంతో మంచిది అని తెలియచేస్తున్నారు ఆల్రెడీ డోసులు తీసుకున్న వారు. ఈ ఐడియా మాత్రం బాగుంది అని అంటున్నారు, దీనిపై ఇక్కడ పేపర్లు మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here