జగన్ దెబ్బకు ఈ జిల్లాలో టీడీపీ ఖాళీ

జగన్ దెబ్బకు ఈ జిల్లాలో టీడీపీ ఖాళీ

0

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దెబ్బకు కొన్ని జిల్లాల్లో టీడీపీ ఖాళీ అవుతోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులో ముందు వరుసలో ఉన్నది కడప జిల్లా… ఈ జిల్లాలో నాటినుంచి నేటివరకు వైఎస్ ఫ్యామిలీదే ఆదిపత్యం…

ఎన్నికల సమయంలో ఈ జిల్లాలో తొడకొట్టేందుకు వచ్చిన వారు, కడపను చంద్రబాబు గిఫ్ట్ గా ఇస్తామన్నవారు ఫలితాల తర్వాత వారి జాడ కాణరాదు. అలా ఎన్నికల సమయంలో మాజీ మంత్రి ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి కడపలో టీడీపీ మెజార్టీ స్థానాలను గెలిపించి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తానని చెప్పారు.

అయితే ఆయన పోటీ చేసిన స్థానంలో కూడా గెలవలేకపోయారు…దీంతో ఆయన తన రాజకీయ భవిష్యత్ ను ద్రుష్టిలో ఉంచుకుని త్వరలో బీజేపీలో చేరబోతున్నారు.

ఇక ఆయన చిరకాల ప్రత్యర్థి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు రామసుబ్బారెడ్డి కూడా తన రాజకీయ భవిష్యత్ ద్రుష్టిలో ఉంచుకుని త్వరలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి… దీంతో త్వరలో కడప జిల్లా జమ్మలమడుగులో టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.