టీడీపీ ఫైబ్రాండ్ పై నాన్ స్టాప్ గా కేసులు నమోదు…

టీడీపీ ఫైబ్రాండ్ పై నాన్ స్టాప్ గా కేసులు నమోదు...

0

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై నాన్ స్టాప్ గా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు… ఇప్పటికే పలు కేసులు ఆయనపై నమోదు అయిన సంగతి తెలిసిందే.

తాజాగా పోలీసులు మరో నాలుగు కేసులు చింతమనేని ప్రభాకర్ పై నమోదు చేశారు… దెందులూరు, పెదవేగి, పెదపాడు పోలీస్ స్టేషన్ లలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి… పీటీ వారెంట్ పై చింతమనేనిని పోలీసులు ఏలూరు జిల్లా జైలు నుంచి కోర్టుకు హాజరు పరిచారు…

దీంతో ఆయనకు జిల్లాకోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది… అంతేకాదు పాత కేసుల్లో కూడా న్యాయస్థానం ఈనెల 20 వరకు రిమాండ్ పొదిగించినట్లు తెలుస్తోంది…