తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో టీడీపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే

0
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక వేడి మొదలైంది, మొత్తానికి పార్టీలు ఉప ఎన్నిక కోసం సిద్దం అయ్యాయి. ఇక మూడు పార్టీల తరపున అభ్యర్దులు నువ్వా నేనా అనేలా సిద్దం అయ్యారు… టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి మద్దతుగా ఆ పార్టీ నేత, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రచారం నిర్వహించనున్నారు.
30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను సిద్ధం చేసింది టీడీపీ..ఈ జాబితాని  ఎన్నికల సంఘానికి పంపింది.
ఇక పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
లోకేశ్, పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బాలకృష్ణ సహా 9 మంది పొలిట్ బ్యూరో సభ్యులు, ఐదుగురు ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
వీరు అందరూ స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారు… అయితే ఇటు వైసీపీ అటు జనసేన బీజేపీ అభ్యర్దులు కూడా ప్రచార హోరు పెంచనున్నారు… చూడాలి ఇక్కడ ప్రజలు ఎవరి వైపు ఉంటారో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here