నాగార్జునను టార్గెట్ చేసిన రకుల్ ప్రీత్ కామెంట్స్ !

నాగార్జునను టార్గెట్ చేసిన రకుల్ ప్రీత్ కామెంట్స్ !

0

ఈ వారం విడుదల కాబోతున్న ‘మన్మధుడు 2’ ను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ తన పై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే సందర్భంలో అనుకోకుండా నాగార్జునను టార్గెట్ చేయడం షాకింగ్ గా మారింది. ఈమూవీలో నాగార్జున రకుల్ ప్రీత్ ల మధ్య డీప్ లిప్ లాక్ లు ఉన్న నేపధ్యంలో షష్టిపూర్తి వయసులో నాగార్జునకు ఇదేమి పాడుబుద్ధి అంటూ కొందరు సెటైర్లు వేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సెటైర్ల పై నాగార్జున తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు రకుల్ ఆ విమర్శల పై స్పందిస్తూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ముంబాయిలో తనకు తెలిసిన అమ్మాయి తన తండ్రి వయస్సు ఉన్న వ్యక్తిని పెళ్ళి చేసుకున్న సంఘటన ఈమధ్య జరిగింది అంటూ రొమాన్స్ కు వయస్సుతో సంబంధం ఏమిటి అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తోంది.
అంతేకాదు తాను ఈమధ్య అజయ్ దేవగన్ తో లేటెస్ట్ గా నటించిన బాలీవుడ్ మూవీ ‘దే దే ప్యార్ దే’ మూవీలో కూడ తన పాత్ర తన తండ్రి వయస్సుతో ఉండే అజయ్ దేవగన్ తో రొమాన్స్ చేసిన సీన్స్ చూసి బాలీవుడ్ ప్రేక్షకులు ఆమూవీని 100 కోట్ల సినిమాగా మార్చిన సందర్భాన్ని గుర్తుకు చేస్తోంది. ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ అమ్మాయిలు సిగరెట్లు కాల్చినంత మాత్రాన వాళ్ళ వ్యక్తిత్వం పై తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకుంటే ఎలా అంటూ ఆమె సరికొత్త చర్చకు తెర లేపుతోంది.

దీనితో రకుల్ ఆ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూను చదివిన వారికి నాగార్జున వయస్సును అందరికీ గుర్తుకు వచ్చే విధంగా రకుల్ కామెంట్స్ ఉన్నాయా అని అనిపించడం సహజం. ఇదే సందర్భంలో రకుల్ నాగార్జున మంచితనం గురించి మాట్లాడుతూ తనను షూటింగ్ సమయంలో ఒక సొంత కుటుంబ సభ్యురాలిగా చూసుకున్న నాగ్ సంస్కారాన్ని ఆమె బయటపెట్టింది. అయితే ‘మన్మధుడు 2’ లో ఆసినిమాలోని తమ పాత్రల స్వభావం రీత్యా కాస్త డేరింగ్ గా నటిస్తే ఆ నటన పై సెటైర్లు వేయడం ఏమిటి అంటూ తన మాటలతో రకుల్ ప్రీత్ ఎదురు దాడి మొదలుపెట్టింది..