నాగ చైతన్య సినిమాలో ముగ్గురు హీరోయిన్లు

0
అక్కినేని నాగచైతన్య తన సినిమాల జోరు పెంచారు, తాజాగా ఆయన థాంక్యు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు..ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. చైతూ మొదటి సినిమా జోష్ను నిర్మించిన దిల్ రాజు మళ్లీ ఇన్నాళ్లకు చైతూ సినిమాను నిర్మిస్తున్నారు.  ఇక సరికొత్త టైటిల్ ని ఫిక్స్ చేశారు, ఈ సినిమా ఎంతో విజయం సాధిస్తుంది అని చిత్ర యూనిట్ భావిస్తోంది.
 ఈ సినిమాలో నాగచైతన్య హాకీ ఆటగాడిగా కనిపించబోతున్నారు. ఇక శరవేగంగా చిత్ర షూటింగ్ జరుపుకుంటోంది.
టాలీవుడ్ టాక్ చూస్తే ఇందులో ముగ్గురు నటీమణులు ఉంటారు అని వార్తలు వినిపిస్తున్నాయి… ఈ సినిమాలో రాశీఖన్నా, ఎవడే సుబ్రమణ్యం ఫేం మాళవిక నాయిర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు అనేది తెలిసిందే.
అయితే మరో నటి ఎవరు అనేది చూస్తే టాలీవుడ్ లో వార్తల ప్రకారం ఉయ్యాలా జంపాలా ఫేం అవికా గోర్ ఈ సినిమాలో నటించనున్నట్లు టాక్. అయితే దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు, ఇక తాజాగా చైతన్య సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ 16న వెండితెరపై విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here