బిగ్ బాస్ రెమ్యునరేషన్ నాగార్జున ఎంత తీసుకున్నారో తెలిస్తే షాక్

బిగ్ బాస్ రెమ్యునరేషన్ నాగార్జున ఎంత తీసుకున్నారో తెలిస్తే షాక్

0

బిగ్ బ్రదర్ షో నుంచి మన ఇండియాలో బిగ్ బాస్ రియాల్టీ షో వచ్చింది, అయితే కంటెస్టెంట్స్ తో హౌస్ లో బయట ప్రపంచానికి సంబంధం లేకుండా జీవించడం అంటే నిజంగా ఇది ఓ దీవిలో వదిలితే ఎలా ఉంటుందో అలా అని చెప్పాలి.. కన్నడ, మలయాళీ, తెలుగు, తమిళ, మరాఠీ, హిందీ, బెంగాలీ భాషల్లో ప్రతీ చోటా సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది బిగ్ బాస్. దేశంలో ఏ షోలకు లేని రేటింగ్, 25 పర్సంట్ ప్రతీ చోటా దాటింది అంటే దీని పవర్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

మరి హౌస్ మేట్స్ చేసే తప్పులు సరిదిద్దాలి. వారిని మంచిగా నడిపించాలి. దారిలో పెట్టాలి అంటే కచ్చితంగా హౌస్ లో సరైన హోస్ట్ కావాలి.. మరి ఈసారి తెలుగులో సీజన్ 3 కి కింగ్ నాగార్జున హోస్ట్ గా మారారు.. 100 రోజులు ఈ షోపై ఆయన ఫోకస్ పెట్టి కంటెస్టెంట్స్ ని సరైన దారిలో పెట్టి, వారి తప్పు ఒఫ్పులు సరిచేశారు, అయితే హీరో కమ్ బిజినస్ మాన్ అయిన నాగార్జున మరి ఈ షోకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనేది మాత్రం ఇప్పటికీ చాలా మందికి తెలియదు.

అయితే నాగార్జున మొత్తం ఈ షోకి దాదాపు 5 కోట్లు తీసుకున్నారు అని తెలుస్తోంది. అయితే సీజన్ 1 ఎన్టీఆర్ 2.5 కోట్లు తీసుకుంటే, నాని 100 రోజులకి 3 కోట్లు తీసుకున్నారట. ఇక నాగార్జున 5 కోట్లు తీసుకోవడంతో ఇప్పుడు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు, ఇక నెక్ట్స్ సీజన్ 4 హోస్ట్ కు ఫేమ్ బట్టీ 7 నుంచి 10 కోట్లు ఇచ్చేందుకు బిగ్ బాస్ సిద్దం అని వార్తలు వస్తున్నాయి.