బ్రేకింగ్ – చిత్రసీమలో విషాదం ప్రముఖ నటుడు కన్నుమూత

0
చిత్ర సీమలో విషాదం నెలకొంది, మలయాళీ నటుడు కన్నుమూశారు,  ప్రముఖ మలయాళీ నటుడు, స్క్రీన్ రైటర్ బాలచంద్రన్ కన్నుమూసారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించడంతో పాటు అనేక సినిమాలకు స్క్రీన్ రైటర్ గా కూడా పని చేశారు..
ఈయన వయసు 69 సంవత్సరాలు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు చివరకు ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఈయనకు భార్య శ్రీలత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గతంలో ఆయన టీచర్ గా పని చేశారు, తర్వాత సినిమా పరిశ్రమలోకి 1991లో ఎంట్రీ ఇచ్చారు, ఇక నటుడిగా రైటర్ గా అనేక సినిమాలకు మాటలు కధ అందించారు. అనేక జాతీయ అవార్డులు కేరళ స్టేట్ అవార్డులు ఆయన అందుకున్నారు.
2012లో ఈయన మేఘరూపమ్ అనే సినిమాను డైరెక్ట్ చేసారు. ఈయన అంత్యక్రియలు ఈయన స్వగ్రామం వైకోమ్లో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆయన లేరు అనే వార్త విని చిత్ర సీమ ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here