ఏడేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం

ఏడేళ్లబాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం

0

బాలికల అత్యాచారాలపై చట్టాలు ఎన్ని కఠిన చట్టాలు వస్తున్నప్పటికీ అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు ఇంట్లో బయట చిన్న పెద్ద తేడా లేకుండా ప్రపంచంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి తాజాగా విశాఖలో మరో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్లబాలికపై పదహారేళ్ల బాలుడు అత్యాచారం చేశాడు వివరాల్లోకి వెళితే..

విశాఖపట్టణంలోని ప్ర హ్లాదపురం లో ఏడేళ్లబాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి ఒడి కట్టాడు. ఈనెల 4వ తేదీన ట్యూషన్ కి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికారు. అయినప్పటికీ పాప ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు అనుమానం వచ్చి పక్కింట్లో వెతికారు.

ఆ సమయంలో బాలుడు బాలిక ఒంటరిగా ఆ ఇంట్లో కనిపించారు. దీంతో ఆ బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడని గ్రహించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.