హైదరాబాద్‌కు 185 మంది ప్రయాణికులు..11 మందికి కరోనా పాజిటివ్‌..కొత్త వేరియెంటేనా?

185 passengers to Hyderabad..11 corona positive

0

హైదరాబాద్‌: ఒమిక్రాన్‌ పుట్టిన దేశం దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు గత మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు రావడం మారింది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో వారంతా హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. అలాగే అదే వేరియంట్‌తో గజగజ వణికిపోతున్న బోట్స్‌వానా నుంచి 16 మంది వచ్చారు.

వీరితో పాటు కరోనా కొత్త వేరియెంట్‌ కేసులున్న 12 దేశాల నుంచి కూడా ప్రయాణికులు వచ్చారు. వచ్చిన వారందరికీ ఆసుపత్రిలోని ప్రత్యేక బృందాలు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేశాయి. ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. అలాగే ప్రయాణికుల రక్త నమూనాలను సీసీఎంబీకి పంపినట్లు తెలిసింది.

అక్కడ ఈ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తారు. ఆ పరీక్షలో అది ఏ వేరియంటో నిర్ధారిస్తారు. పాజిటివ్‌ వచ్చిన ప్రయాణికులను ఐసోలేషన్‌కు తరలించారు. ఈ మూడు రోజుల్లో 57 దేశాల ప్రయాణికులు వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here