2019లో యూపీ రాజకీయాలు పెద్ద కుదుపు కమల వికాసం

2019లో యూపీ రాజకీయాలు పెద్ద కుదుపు కమల వికాసం

0

నిజమే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు, ఎప్పుడు ఎవరైనా ఎలాగైనా మారిపోవచ్చు, ఏ పార్టీలోకి అయినా జంప్ అవ్వచ్చు ఎవరు ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవచ్చు. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన చాలా పార్టీలు ఈసారి ఒంటరిగా బరిలో నిలిచాయి, అప్పుడు ఎవరికివారుగా పోటీ చేసిన పార్టీలు.. ఇప్పుడు కలిసి పోటీచేశాయి. 2019 ఎన్నికల్లో ఇలాంటి సీన్లు చాలా కనిపించాయి.

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా ఈ సీన్ కనిపించింది. ఢిల్లీ పీఠం ఎక్కేందుకు కీలకంగా భావించే ఉత్తర్ప్రదేశ్లో.. గత ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలన్నీదాదాపు ఒంటరిగానే రంగంలోకి దిగాయి. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా పోటీ చేయగా బీజేపీ, అప్నాదళ్తో కలిసి పోటీ చేసింది. అయితే అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. కేంద్రంలో అధికారం చేజిక్కించుకోగా ప్రత్యర్థి పార్టీలు చిత్తయ్యాయి.

మాయావతి, అఖిలేశ్ యాదవ్ అయితే, అప్పుడు వేర్వేరుగా పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీలు.. ఈ ఎన్నికల్లో ఒక్కటిగా ముందుకు కలిసి వచ్చాయి అయినా అక్కడ బీజేపీ గెలిచింది.. ఎవరి త్రయం కూడా ఒకే అవ్వలేదు. చివరకు యూపీలో కూడా మళ్లీ బీజేపీ అసెంబ్లీలు పార్లమెంట్ స్ధానాలు మెజార్టీ గెలుచుకుంది. మిత్రులు శత్రువులు ఎవరూ రాజకీయాల్లో ఉండరు అనేది ఈ ఎన్నికలు 2019లో స్పష్టం చేశాయి.