కంఫర్ట్ జోన్ లో జగన్ బాబుకి ఎదురుదెబ్బ

కంఫర్ట్ జోన్ లో జగన్ బాబుకి ఎదురుదెబ్బ

0
30

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కంఫ్టర్ జోన్ లో ఉన్నారు అనే చెప్పాలి.. మరో రెండు రోజుల్లో ఆయన అభ్యర్దుల ప్రకటన చేయనున్నారు.. ఇక తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేటిసాయంత్రం తన తొలిజాబితా విడుదల చేయనుంది .ఇక పవన్ కల్యాణ్ తెలివిగా 32 మంది తొలిజాబితా ప్రకటించారు. నలుగురు ఎంపీ అభ్యర్దులను కూడా ప్రకటించారు. అయితే వీరి లిస్టులు ఎలా ఉన్నా జగన్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎక్కడ ఎవరు నిలబెడితే తెలుగుదేశం జనసేన పార్టీలకు గట్టిపోటి ఇస్తారు అని చూస్తున్నారు.

అలాగే సామాజిక అంశాలు వర్గ వైరం రాకుండా చూస్తున్నారు.. ముఖ్యంగా ఏపీలో కులాల కుమ్ములాటలు ఉంటాయి.. అందుకే జగన్ కూడా ఎవరికి సీటు ఇస్తే వైరి వర్గం వారు రచ్చ చేయరు అనేది చూస్తున్నారు…అయితే వర్గపోరు చాలా వరకూ కామన్, ఎందుకు అంటే ఓచోట ఇద్దరు ముగ్గురు అభ్యర్దులు సీటు కోసం చూస్తున్నారు.. ఈ సమయంలో వారికి టికెట్ ఇస్తే మరొకరు సపోర్ట్ చేయరు.. అందుకే కొన్ని సెగ్మెంట్ల విషయంలో అర్ధరాత్రి వరకూ చర్చలు జరిపి ఆ తర్వాత అభ్యర్దులను ఫైనల్ చేయనున్నారు జగన్, ముఖ్యంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోమని చెప్పినా మార్చుకోలేదు. ఇప్పుడు కొత్తవారికి అక్కడ అవకాశం ఇస్తున్నారు. అందుకే వారికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు.. అయితే అవకాశం ఇచ్చిన సమయంలో అందిపుచ్చుకోలేదు అని విమర్శిస్తున్నారు వైసీపీ నాయకులు.. సో జగన్ మాత్రం మంచి ఫామ్ లో ఉన్నారు, అలాగే కంఫ్టర్లు జోన్ లో ఉన్నారు అనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.