ఎమ్జీఆర్,ఎన్టీఆర్ మధ్యలో పార్టీ పెట్టిన హీరో ఎవరూ..?

ఎమ్జీఆర్,ఎన్టీఆర్ మధ్యలో పార్టీ పెట్టిన హీరో ఎవరూ..?

0
38

రాజకీయ నేతలు హీరోలు కాలేరు. కాని హీరోలు మాత్రం రాజకీయ నేతలు అయ్యారు మన దేశ చరిత్రలో. ముఖ్యంగా మన దేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. మన దగ్గరున్న చాలా మంది నటులు సినిమాల్లో నటిస్తూనే పాలిటిక్స్‌లో ఎంటరై ఒక వెలుగు వెలిగారు. భారత దేశంలో ఒక పార్టీ పెట్టి అధికారంలో వచ్చిన సినిమా నటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది తమిళ నటుడు ఎంజీఆర్ గురించే. 1972లో అప్పటి డీఎంకే పార్టీ ఛీఫ్ కరుణానిధితో విభేదించి ఏఐఏడీఎం కే పార్టీని స్థాపించారు ఎంజీఆర్. ఆ తర్వాత 1977లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఆ తర్వాత చనిపోయేంత వరకు ఎంజీఆర్ ముఖ్యమంత్రిగానే కొనసాగారు. ఎంజీఆర్ తర్వాత రాజకీయ పార్టీని స్థాపించిన నటుల్లో బాలీవుడ్ స్టార్ దేవానంద్ ఒకరు. 1980లో ఆయన నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీని స్థాపించారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ పార్టీ… 1980 జనరల్ ఎలక్షన్స్ తర్వాత కనుమరుగైంది.ఎంజీఆర్ లాగే తాను కూడా అదే రకంగా రాజకీయాల్లో రాణించగలనని బలంగా నమ్మారు దేవానంద్. అందుకే 14 సెప్టంబర్ 1979లో నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎంపీఇ)ను స్థాపించారు. దేవానంద్ పార్టీకి నెహ్రూ సోదరి విజయలక్ష్మీ కూడా మద్దతు ప్రకటించడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. 1980 ఎన్నికల ముందు దేవానంద్ తన పార్టీ మేనిఫెస్టో అని ఎన్నో హామీలు ఇచ్చారు. అప్పట్లో చాలా మంది సినిమావాళ్లు సైతం దేవానంద్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించడం మరో విశేషం. దేశవ్యాప్తంగా 500పైగా స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఎన్నికల్లో మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. దీంతో కలత చెందిన దేవానంద్ తన పార్టీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దేవానంద్ పార్టీ పెట్టిన రెండున్నరేళ్లకు తెలుగునాట మహానటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో 1982 మార్చి 29న పార్టీని స్థాపించిన ఎన్టీఆర్… పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు.

అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మరో పార్టీ బలంగా లేకపోవడంతో తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌కు బ్రహ్మరథం పట్టి… టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించారు. ఆ తర్వాత వీరి స్పూర్తితో ఎంతో మంది నటులు సొంతంగా రాజకీయ పార్టీలను స్థాపించినా…ఎమ్జీఆర్, ఎన్టీఆర్ తరహాలో విజయాలు సాధించలేకపోయారు.ఈ రకంగా దేశరాజకీయల్లో దేవానంద్ పెట్టిన నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా అట్టర్ ప్లాపైంది. వీరి తర్వాత చిరంజీవి కుడ ప్రజా రాజ్యం పార్టి పెట్టి ఓటామి పాలై దానిని కాంగ్రెస్ లో వీలినం చేశారు. ఇప్పుడు అతని తమ్ముడు పవన్ కల్యాన్ కుడ జనసెన పార్టి ఎర్పాటు చేశాడు. వీరందరు .ఎమ్జీఆర్, ఎన్టీఆర్ లనే స్ఫుర్తిగా తీసుకుని పార్టీలు పెట్టారు.