నేను నటించిన బోల్డ్ సీన్స్ ని మా కుటుంబం అందరితో కలిసి చూస్తాను – కియారా..!!

నేను నటించిన బోల్డ్ సీన్స్ ని మా కుటుంబం అందరితో కలిసి చూస్తాను - కియారా..!!

0

కియరా అద్వానీ… ఈ పేరు తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమ అభిమానులకు సుపరిచితమే. ఈ భామ బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించి, టాలీవుడ్ లో భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు సరసన నటించింది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్‌లో తన అందాలను ఆరబోస్తు మరింత బోల్డ్ సీన్లలో నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. సెక్స్ టాయ్స్ ఉపయోగించి స్వయంతృప్తి పొందే సీన్లతో పాటు, పడకగది శృంగార సీన్లలో ఎలాంటి మొహమాటం లేకుండా నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

తాజాగా ఈ అమ్మడు ప్రముఖ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొని ‘లస్ట్ స్టోరీస్’ గురించి ప్రస్తావన తీసుకురాగా అందుకు ఆమే ఆసక్తిక విషయాలు చెప్పుకొచ్చారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులతో పాటు గ్రాండ్ మదర్ కూడా తాను నటించిన ఆ సీన్లు చూసినట్లు చెప్పింది. వారు ఎలా రియాక్ట్ అయ్యారో కూడా వెల్లడించారు. తనకు కుటుంబ సభ్యుల సహాకారం పూర్తిగా లభించిందన్నారు. ముందుగా గ్రాండ్ మదర్ పూర్తి మద్దతు ఇచ్చారు. ఎందుకంటే అది కేవలం నటన మాత్రమే. నా తల్లిదండ్రులతో కలిసి చూశాను. అందరికీ నా నటన ఎంతో నచ్చింది. ఇదంతా నా ప్రొఫెషన్లో భాగం. ఆ విషయం వారికి కూడా తెలుసు’ అని కియారా చెప్పుకొచ్చారు.

నేను నటించిన ఆర్గాజం(స్వయం తృప్తి) సీన్ చూసినపుడు మా పేరెంట్స్ ఏ మాత్రం ప్రభావితం కాలేదు. సినిమా కోసం నేను ఎలాంటి సీన్ చేయడానికైనా ఒప్పుకుంటానని వారికి ముందే తెలుసు. వారికి నేను ముందుగానే అన్ని విషయాలు చెప్పి ప్రిపేర్ చేస్తానని కియారా వెల్లడించారు. మా గ్రాండ్ మదర్ బ్రిటిష్. అందుకే ఆమెకు కొన్ని హిందీ జోక్స్ అర్థం కావు. సబ్ టైటిల్స్ చదువుతూ అర్థం చేసుకుంటుంది. ఎలాంటి సీన్లు అయినా ఏ మాత్రం మొహమాట పడకుండా స్ట్రైట్ ఫేస్ పెట్టి చూస్తుంది. ఇలాంటి విషయాల్లో నాకు మద్దతుగా ఉంటుంది. ఇది కేవలం నటన కాబట్టి స్పోర్టివ్‌గా తీసుకుటుందని కియారా తెలిపారు.

అసలు విషయానికి వస్తే కియారా ప్రస్తుతం నటించిన బాలీవుడ్ అర్జున్ సింగ్ కు సీక్వల్ హిందీలో ‘కబీర్ సింగ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో షాహిద్ కపూర్‌కు జోడీగా నటించారు. ఇందులో కూడా తన అందాల నటనతో హద్దులు దాటేశారు. ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు సినిమాలో హైలెట్ కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here