అసెంబ్లీ లో నోరు జారిన రాపాక… !!

అసెంబ్లీ లో నోరు జారిన రాపాక... !!

0

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నోరు జారటంతో ఆ మాటలకు వైసీపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. రాపాక మాట్లాడుతూ… మిత్రపక్షం బీజేపీని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని అధికార వైసీపీని కోరారు. దీనిపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాపక వరప్రసాద్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు.

తాము బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేదని.. తాము కనీసం పొత్తు కూడా పెట్టుకోలేదని గుర్తు చేశారు. జనసేన ఎమ్మెల్యే ఏదిపడితే అది మాట్లాడితే కుదరదని చెప్పారు. టీడీపీతో జనసేన అంతర్గత పొత్తు విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కేంద్రంతో పోట్లాడే పరిస్థితి లేదని.. సఖ్యతగా ఉంటూ హోదా సాధనకు కృషి చేస్తామని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here