మ్యాచ్‌లో వర్షం: గేల్‌తో కలిసి స్టెప్పులేసిన కోహ్లీ

మ్యాచ్‌లో వర్షం: గేల్‌తో కలిసి స్టెప్పులేసిన కోహ్లీ

0
30

వరల్డ్ కప్ లోనే కాదు వెస్టిండీస్‌తో సిరీస్‌లోనూ వర్షం ఆడేసుకుంటుంది. 3 టీ20లు, 3వన్డేలు, 2టెస్టులు ఆడేందుకు విండీస్ పర్యటన చేపట్టిన టీమిండియాకు టీ20లతో పాటు వన్డేలలోనూ వర్షం బాధ తప్పేట్టులేదు. మ్యాచ్ జరగడానికి ఆలస్యం, మైదానం స్వరూపం మార్చేసుకోవడం ఇలాంటివి జరుగుతున్నప్పటికీ వర్షం రావడం పట్ల కోహ్లీ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

గుయానా నేషనల్ స్టేడియం వేదికగా మొదలైన తొలి వన్డే వర్షం కారణంగా గంటసేపు ఆలస్యంగా మొదలైంది. దీంతో ఇరు జట్లకు 40ఓవర్లు నిర్దేశించిన అంపైర్లు మ్యాచ్ ను ఆరంభించారు. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ చేయడంతో విండీస్ బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా కష్టపడింది. భారత బౌలర్ల ధాటికి 13ఓవర్లకు 55మించని స్కోరుతో విండీస్ బ్యాట్స్‌మెన్ క్రీజులో తడబడుతుండగా మరోసారి వర్షం కురిసింది.

దోబూచులాడుతున్న వర్షానికి స్వాగతం చెబుతూ కోహ్లీ విండీస్ బ్యాట్స్‌మన్‌తో కలిసి చిందులేశాడు. ఈ క్రమంలో తొలి వన్డేను ఫలితం తేలకుండానే ఇరు జట్లు ముగించేశాయి. వెస్టిండీస్ 13ఓవర్లకు కేవలం 54పరుగులు చేయగలిగింది. సిరీస్‌లో ఇంకా 2మ్యాచ్‌లు మాత్రమే మిగలడంతో ప్రతి మ్యాచ్ కీలకం కానుంది.