శభాష్ సమంత..

శభాష్ సమంత..

0
27

నాగ్ పుట్టిన రోజున కోడలు, నటి అక్కినేని సమంత..ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా నాగార్జున 60వ పుట్టినరోజు వేడుకలు స్పెయిన్లో జారుపుకోవాలని అనుకున్నారు. దీని కోసం సమంత, చైతు వారం ముందే ఇబిజకు చేరుకొని అక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. తన పుట్టినరోజు నాడు ఫ్యామిలీతో సహా ఇబిజకు చేరుకున్నా నాగార్జున కుటుంబంతో పాటు అక్కడ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.

ఇందులో భాగంగా నాగార్జున అక్కడ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తూ తన కండలు చూపిస్తున్న ఫోటో పై సమంత భలే కామెంట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ.. ’మీరు వయసునే ఓడించారు మామ’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఇంకా ఈ ఫోటోతో పాటు సమంత, చైతు, నాగ్, అమల, అఖిల్ కలిసి తీసుకున్న ఫ్యామిలీ ఫోటో కూడా షేర్ చేస్తూ ’’మీ ప్రేమకి ధన్యవాదాలు. ఎప్పటికి మీ ప్రేమ, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను’’ అని నాగ్ మామ చెప్పమన్నారు అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా అక్కినేని ఫ్యాన్స్ సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.