హుజూర్నగర్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలుస్తుందా..?

హుజూర్నగర్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలుస్తుందా..?

0
30

నల్గొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయిపోయింది. దీంతో అందరి కన్ను హుజూర్నగర్ పై పడింది. అయితే ముందస్తు ఎన్నికలు జరిగిన పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పై ఏడు వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తంకుమార్ రెడ్డి గెలిచారు. ప్రస్తుతం జరిగే టిఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య హుజూర్నగర్ బై ఎలక్షన్ హోరాహోరీగా సాగనుంది.

ఈసారి హుజూర్నగర్ స్థానం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి ని బరిలోకి దింపుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ శానంపూడి సైదిరెడ్డి నా బై ఎలక్షన్లలో దింపాలని చూస్తోంది. ఇదిలా ఉంటే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే నిజామాబాద్ ఎంపి గా పోటీ చేసి పరాజయం అయినా కవితను ఈ బై ఎలక్షన్ లో దింపాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు టిఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే మొదట కవితను మంత్రి వర్గంలోకి తీసుకుంటారని అందరూ భావించినా కెసిఆర్ మాత్రం అల్లుడు హరీష్ రావు, కొడుకు కేటిఆర్ కి మంత్రి పదవులు కట పెట్టారు. మొత్తం మీద కొన్ని నెలలుగా సాగుతున్న ఎన్నికల సీజన్ కి హుజూర్నగర్ బై ఎలక్షన్స్ చివరిది కావడంతో ఈ ఎలక్షన్ లో ఎలాగైనా గెలిచి విజయ న్ని అందుకోవాలని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి.