మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఇక్కడికి వెళ్లాల్సిందే…

-

ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు… ప్రతిఫలంగా వారు వినీ, చూడని రోగాలను తెచ్చుని బాధ పడుతున్నారు… ఇక మరి కొంత మంది మానసిక ప్రశాంతత కరువై చిన్న వయస్సులోని వయోభారాన్ని మోస్తున్నారు… అయితే అలాంటి వారికి తిరిగి…. వారి పాత జీవితాన్ని అందించేందుకు సంస్కార్ ప్రకృతి ఆశ్రమం పేరుతో హేమలతా లవణం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు…

- Advertisement -

1997లో ప్రారంభించిన ఈ ఆశ్రమం నేడు దేశ వ్యాప్తంగా గుర్తింపు చెందుతోంది….. ఇక్కడ ఎలాంటి ఇంగ్లీష్ మందులకు తావు ఉండదు… కేవలం ప్రకృతి నుంచి వచ్చే ఓౌశదాల యోగాల, ద్వారా దీర్ఘకాళిక రోగాలను నయం చేస్తారు… మొదట్లో పచ్చని చెట్ల మధ్య 20 పడక గదులతో ప్రారంభం అయిన ఈ సంస్కార్ ప్రకృతి ఆశ్రమం ఇప్పుడు 100 పడక గదలుకు పైగా విస్తరించిపోయింది…

రానున్న మరికొద్ది రోజుల్లో 1000 పడక గదులకు విస్తరించే అవకాశం ఉందని అంటున్నారు… శ్రీకాకుళం, అనంతపురం, మహారాష్ట్ర, హైదరాబాద్ విజయవాడ వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చి వ్యాధి గ్రస్తులు ఇక్కడ ప్రకృతి చికిత్సతో రోగాల నుంచ ఉపశమనం పొందుతున్నారు… అధిక బరువు ఆస్తమా పెరాలసిస్ నడుము నొప్పి మొడ నొప్పి సోరియాసిస్ చర్మవ్యాధులను నయం చేసేలా రోగాలు అదుపులో ఉండేలా ఆహార అలవాట్లను మార్చుతారు… భయంకరమైన ఎయిడ్స్, క్యాన్సర్ వంటి వ్యాధులు మినహా అన్ని దీర్ఘకాళిక రోగాలకు ఇక్కడ ప్రకృతి ద్వారా వైద్యాన్ని అందిస్తారు… ఈ సంస్కార్ ప్రకృతి ఆశ్రమం నిజామాబాద్ జిల్లాలో అక్బర్ నగర్ లో ఉంది…

ఉప్పు, నూనె లేకుండా మసాలాలు వేయకుండా జొన్నరొట్టె, గోధుమ రొట్టె, పుల్కాలు, ముడి బియ్యం అన్నం, కూరగాయలు, పచ్చి మిరపకాయలతో వంట చేసి వడ్డిస్తారు. వైట్‌రైస్‌ని వైట్ పాయిజన్ (విషం)గా ఇక్కడ భావిస్తారు. వైట్‌రైస్‌కు బదులు ముడిబియ్యంతో వండిన అన్నం వడ్డిస్తారు. ఆహారమే ఔషధంగా చికిత్సలందించి దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం పొందేలా చేస్తారు. వంద పడకలకు సంబంధించి రోగులకు వివిధ కేటగిరీగా వారి ఆర్థిక స్థోమతను బట్టి ఆహారంతో కలిపి గదులకు అద్దె నిర్ణయించారు.

త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా..
పెళ్లి సంబంధం కుదరడంతో బరువు తగ్గేందుకు ఇక్కడికి వచ్చాను. వారంలో మూడు కేజీల బరువు తగ్గాను. ఉదయం 4.30 గంటల నుంచే యోగాసనాలు వేయిస్తారు. ఉప్పు, నూనె లేకుండా భోజనాలు పెడుతున్నారు. ఉదయం అల్పాహారం కింద మొలకలు, ఖర్జూరం ఇస్తున్నారు. ఇక్కడి వాతావరణం బాగుంది. -సుహాసిని, నెల్లూరు

జీవన శైలితోనే బీపీ షుగర్లు..
దేశంలోనే అత్యధికంగా బీపీ, షుగర్‌లు ప్రమాదకరస్థాయిలో వ్యాప్తి చెందుతున్నాయి. సెల్‌ఫోన్ వాడకం, మానసిక ఒత్తిడి, సమయపాలన లేకుండా భోజనం, అమితం గా భుజించడం, శారీరక శ్రమ లేకపోవడం, నూనె పదార్ధాలు, మసాలా వేపుళ్లు తినడంతో అనేక దీర్ఘకాలిక జబ్బుల బారిన పడుతున్నారు. ముందస్తు జాగ్త్రలు తీసుకొని ప్రకృతి పరమైన చికిత్స ద్వారా చాలా రోగాలను నయం చేసుకోవచ్చు. – డాక్టర్ శరత్‌బాబు

చికిత్సలు బాగున్నాయి..
ఆహ్లాదకర వాతావరణంలో చికిత్సలు తీసుకోవడం ఎంతో బాగుంది. ఇంతకు ముందు ఓసారి వచ్చాను. మరోసారి రావాలనిపించి చికిత్స తీసుకుంటున్నాను. ఇది శరీరానికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.
– గంగారెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అనంతపురం

డెబ్బై కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది
కొన్నేళ్ల క్రితం ఏర్పాటైన ఈ ఆశ్రమం ఆధారంగా అక్బర్‌నగర్‌కు చెందిన 70 కుటుంబాల వరకు బతుకుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు సేవలు చేసేందుకు ఇక్కడి గ్రామస్తులు వివిధ రకాల పనుల్లో ఇక్కడ ఎంతో కాలంగా కొనసాగుతున్నారు.
– రామాగౌడ్, అక్బర్‌నగర్ సర్పంచి

ఆహారమే ఔషధం..
మనం తినే ఆహారం ద్వారానే ఎక్కువగా రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. మితభోజనం చేయకుండా అమితంగా తినడం శరీర జీర్ణస్థితిని పరిగణలోకి తీసుకోకుండా మనిషి రోగాలను కొని తెచ్చుకుంటున్నాడు. తినే ఆహారాన్ని కంట్రోల్ చేసుకొని నూనె, ఉప్పు, కారం, మసాలాలు లేకుండా ఆహారాన్ని భుజించడంతో పాటు ప్రకృతిపరమైన చికిత్సలు తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసుకోవచ్చు.
-రామకృష్ణారావు, సంస్కార్ ప్రకృతి ఆశ్రమ డైరెక్టర్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TDP final List: టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న...

Manchu Manoj | “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్”: మంచు మనోజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తాజాగా హీరో మంచు మనోజ్(Manchu...