మీరు బయట చికెన్ తింటున్నారా ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

మీరు బయట చికెన్ తింటున్నారా ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

0
38

మీరు బయట చికెన్ తినే సమయంలో కొన్ని విషయాలు మీరు బాగా గమనించండి. ఎందుకు అంటే నిలువ ఉన్న చికెన్ ని మీకు అంటగడుతున్నారు.. ముఖ్యంగా బిర్యానిలు బయట తినే సమయంలో కొన్ని టెక్నిక్ లు ఫాలో అవ్వాలి. లేకపోతే చెడిపోయిన ఆహరం మీకు అంటగట్టే ప్రమాదం ఉంది.

1.. మీరు చికెన్ తింటే అది కలర్ బాగా కనిపిస్తే అసలు తినకండి అది వాసన రాకుండా కచ్చితంగా ఫుడ్ కలర్ కలిపింది అయి ఉంటుంది.

2. బాగా ఉడికిన చికెన్ మాత్రమే తినండి.. బాగా ఉడకలేదు అంటే అది పాత చికెన్ అని అర్ధం.

3. ఇక చికెన్ స్పైసీగా ఉన్నా కచ్చితంగా తినకండి దీని వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉందట.

4. కచ్చితంగా బిర్యాని కొనుక్కునే సమయంలో రాత్రి 9 తర్వాత ఉదయం 1 గంట తర్వాత తింటే అది ఫ్రెష్ చికెన్ అవుతుంది

5. ఒకవేళ అంతకు ముందే మీరు చికెన్ బిర్యాని తింటే పాత ఫుడ్ మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది

6. ఇక బటర్ చికెన్ లాలిపప్ చికెన్ వింగ్స్ చికెన్ ఇలా చాలా అమ్ముతూ ఉంటారు మంచి రేటింగ్ ఉండే చోట మాత్రమే అవి తినండి

7. కొన్ని చిన్న చిన్న హోటల్స్ లో కూడా నిలువ అయిన మసాలా వాడుతున్నారు.. దానికి కాస్త దూరంగా ఉండండి.. కూర్మాలు విత్ గ్రేవీలలో ఇదే వాడుతున్నారు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ వారే ఈ విషయాలు చెబుతున్నారు కొన్ని చోట్ల ఇలాంటి మోసాలు బయటపడ్డాయి,

8. రాత్రి చికెన్ వేడి చేసి ఉదయం అమ్ముతున్న హోటల్స్ ని కూడా కొన్ని సీజ్ చేశారు.. అలాంటి ఫుడ్ కోర్టులు మీరు గమనిస్తే వెంటనే అధికారులకు కంప్లైంట్ ఇవ్వండి.