జగన్ కేసుల విషయంలో సీబీఐ సంచలన నిర్ణయం

జగన్ కేసుల విషయంలో సీబీఐ సంచలన నిర్ణయం

0
48

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇచ్చింది.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుఅవుతూ వచ్చారు..

అయితే ఇప్పుడు సీఎం అయిన తర్వాత తనకు వ్యక్తిగ హాజరునుంచి విమూక్తి కావాలని కోరుతూ పిటీషన్ వేశారు.. తనకు బదులుగా తన లాయర్ హాజరు అయ్యేలా అనుమతి ఇవ్వాలని కోరారు…

ప్రస్తుతం తాను రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నానని ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరు అవుతే ప్రోటోకాల్ సెక్యూరిటీ, కోసం సుమారు 60 లక్షలు ఖర్చు అవుతుందని రాష్ట్ర అర్థిక పరిస్థితి బాగోలేదని దీంతో పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చు అవుతుందని పిటీషన్ లో పేర్కొన్నారు…కాగా జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తులకు పాల్పడ్డారనే ఉద్దేశంతో ఆయనపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే…