2020 జనవరి 1 నుంచి బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్

2020 జనవరి 1 నుంచి బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్

0

ఇక 2019 వెళ్లిపోతోంది కేవలం గంటల సమయం మాత్రమే ఉంది.. అయితే అప్పుడే కొత్త ఏడాదికి ప్లాన్స్ రెడీ అవుతున్నాయి..అయితే బ్యాంకులు మాత్రం కొత్త ఏడాదిలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి, కొన్ని తీసుకున్నాయి కూడా మరి అవి తెలుసుకుందాం.

జనవరి 1 నుంచి వినియోగదారులకు పలు చార్జీల భారం తప్పనుంది. దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపే, యూపీఐ చెల్లింపులపై చార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక జనవరి 1 నుంచి మన దేశంలో ఈ చార్జీలు ఉండవు… అలాగే నెఫ్ట్ చార్జీలు కూడా ఎత్తివేశాయి బ్యాంకులు.
ఏ రుసులు లేకుండా నెఫ్ట్ లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

ఎస్బీఐ జనవరి 1వ తేదీ నుంచి ఏటీఎంలలో డబ్బులు విత్ డ్రా చేసే విషయంలో నూతన విధానాన్ని అమలు చేయనుంది. ఎస్బీఐ ఏటీఎంల నుంచి రూ.10వేలు అంతకన్నా ఎక్కువగా నగదును విత్డ్రా చేస్తే వినియోగదారుల ఫోన్కు ఓటీపీ వస్తుంది. అలాగే వచ్చే రోజుల్లో డిజిటల్ చెల్లింపులపై ఆ బ్యాంకు మరింత ఫోకస్ చేయనుంది. సో మరి వీటిని మీరు ఫాలో అవ్వండి.