పచ్చిమిర్చి అతిగా తింటున్నారా ఆరోగ్యానికి లాభమా నష్టమా తెలుసుకోండి

పచ్చిమిర్చి అతిగా తింటున్నారా ఆరోగ్యానికి లాభమా నష్టమా తెలుసుకోండి

0
41

పచ్చిమిర్చి తింటే కడుపులో మంట అని అనుకుంటాం. ఇవి చూడటానికి గ్రీన్ కలర్ ఉన్నా విపరీతమైన మంట పుట్టిస్తాయి..ఇవి తింటే కారం అని అననివారే ఉండరు నిజమే కదా.. ముదురు కాయలు ఏవి తిన్నా ఇక కడుపులో మంట అని గోల పెడతాం..అయితే శరీరానికి పచ్చిమిర్చి కారం కంటే మంచిది అని చెబుతున్నారు వైద్యులు మరి పచ్చిమిర్చి ఏకాలంలో తీసుకున్నా తీసుకోకపోయినా శీతాకాలంలో తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటితో చాలా మేలు జరుగుతుందట.

ఇవి రోజు తింటే ఒబిసిటీతో ఇబ్బంది పడేవారు, మధుమేహం బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు..మీరు కూరల్లో కారానికి బదులుగా మిర్చివాడకం అలవాటుగా మార్చుకోండి. దీనివల్ల శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా ఉండి మధుమేహం జీవితంలో రాదు.పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో మంట లేకుండా ఉండడంతోపాటు శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. ఇక గుండెకు కూడా చాలా మంచిది, హర్ట్ అటాక్ లాంటి సమస్యలు రావు.

భోజనంలో వారానికి నాలుగుసార్లు మిరపకాయలు తింటే గుండెపోటు ముప్పు 40 శాతం తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు.కేవలం పచ్చిమిర్చే తినాలని ఏం లేదు. పచ్చిమిర్చికి సమానంగా పండుమిర్చి తిన్నా మంచిదే . వీటిలో ఏదైనా పర్వాలేదు. మరి డాక్టర్లు చెప్పేది ఏమిటి అంటే కారం పచ్చిమిర్చి అతిగా తింటే ప్రమాదమే, ఏదైనా ఒకటే ఎంచుకోవాలి అని చెబుతున్నారు, కూరల్లో కారాలు కంటే కమ్మగా వండుకోవాలి పచ్చిమిర్చి వేసుకుంటే మంచిది అని చెబుతున్నారు వైద్యులు.