ఏపీ బీజేపీ పగ్గాలు ఆ మహిళానేతకేనా…

ఏపీ బీజేపీ పగ్గాలు ఆ మహిళానేతకేనా...

0
31

ఏపీ బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ కథ ముగిసినట్లేనా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఆయన స్థానంలో మరికొద్ది రోజుల్లో కొత్తవారిని నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయట… ఇటీవలే మాజీ గవర్నర్ విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు అద్దంపడుతున్నాయి…

ఏపీ బీజేపీలో కన్నాను తప్పించి ఆయన స్థానంలో వేరొకరికి అవకాశం ఇచ్చే ఆలోచనలో కేంద్రం ఉంది… ఇక కన్నా పదవి కాలం కూడా రెండేళ్లు పూర్తి కావడంతో ఆయనను తప్పించడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి… 2019 ఎన్నికలకు ముందు కన్నా వైసీపీలో చేరుతారని వార్తలు రావడంతో ఆయనకు బీజేపీ అధిష్టానం ఫోన్ చేసి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని ఆఫర్ రావడంతో వైసీపీలో చేరే ఆలోచనను విరమించుకున్నారు…

కన్నాకు అధ్యక్ష పదవి ఇచ్చినా కూడా ఆమేరకు పార్టీని బలోపేతం చేయలేకపోయారనేదే గత ఎన్నికల ఫలితాలే నిదర్శనం కన్నా సారథ్యంలో నోటా కంటే పార్టీకి ఓట్లు తక్కువ వచ్చాయి.. దీంతో పార్టీ అధిష్టానాన్ని ఆలోచనలో పడేసింది…

ఇక ఆయన స్థానాంలో ఎవరికి నియమిస్తారనేది చర్చ జరుగుతోంది… వీరిలో ముఖ్యంగా పురందేశ్వరి సోము వీర్రాజు మాధవ్ మాణిక్యాల పేర్లు వినిపిస్తున్నాయి.. అందులో పురందేశ్వరికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది… కేంద్ర మంత్రిగా, డిప్యూటి సీఎం కూతురుగా ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆమెకు బీజేపీ పగ్గాలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు…