ఈ ఘటనతో మెడికల్ షాపుల వారికి హెచ్చరిక

ఈ ఘటనతో మెడికల్ షాపుల వారికి హెచ్చరిక

0
31

ఈరోజుల్లో చిన్న తలనొప్పి వస్తే చాలు ఏదో ట్యాబ్లెట్ తెచ్చివేసుకుంటాం బాగానే ఉంటుంది… ఇలాంటి చిన్న రోగాలకు మెడికల్ షాపుల్లో సిబ్బంది షాపు యజమానులు మందులు ఇస్తారు పర్వాలేదు ..కాని ఎక్కడైనా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకి శరీరంలో లోపల అవయవాలకు సంబంధించి జబ్బులకి మందులు అడిగితే నేరుగా ఇవ్వకూడదు

ఏదైనా కచ్చితంగా డాక్టర్ ప్రిస్కిప్షన్ డాక్టర్ రాసిన మందుల చీటీ ఉండాల్సిందే, అంతేకాదు ఇలా ఎవరైనా డాక్టర్ మందుల చీటీ లేకుండా ప్రిస్కిప్షన్ లేకుండా అమ్మకాలు చేస్తే ఆ షాపు లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, అరెస్ట్ చేస్తారు, తాజాగా తెలంగాణలో 9 మందికి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి వారిని చంపేశాడు నిందితుడు, అసలు ఇలా అన్ని మందులు ఎలా దొరికాయి అంటే ఓ మందుల షాపు వ్యక్తి అవి అమ్మాడు.

దీంతో అతనిపై కసు పెట్టారు షాపు క్లోజ్ చేశారు, ఇలాంటి మందు ఒక్కటి మాత్రమే ఎవరికి అయినా ఇవ్వాలి… అవి కూడా డాక్టర్ రాసిన మందుల చీటి ఉండాలి, కాని ఏమీ లేకుండా అతనికి అమ్మాడు, అందుకే ఇలాంటి మందులు ఎవరికి బయట వారికి అమ్మకండి అని చెబుతున్నారు అధికారులు డ్రగ్ ఇన్సె పెక్టర్లు.