లాక్ డౌన్ 4.0 ఇలా ఉంది మరి 5.0 ఎలా ఉండబోతోంది

లాక్ డౌన్ 4.0 ఇలా ఉంది మరి 5.0 ఎలా ఉండబోతోంది

0
36

దేశంలో ఇప్పటికే నాలుగు లాక్ డౌన్ లు అమలు పరిచారు.. ఇప్పుడు మరో నాలుగు రోజుల్లో నాల్గోదశ లాక్ డౌన్ పూర్తి అవుతుంది, అయితే మే 31 తర్వాత కేంద్రం లాక్ డౌన్ 5 పెడుతుంది అంటున్నారు, ఇది ఖాయం అనే చెప్పాలి, రోజుకి ఆరువేల కేసులు వస్తున్నాయి, ఈ సమయంలో పూర్తిగా అన్నీంటికి అనుమతి ఇస్తే కచ్చితంగా మరిన్ని కేసులు పెరుగుతాయి.

అందుకే కేంద్రం కూడా ఆలోచన చేస్తోంది.. ఇప్పటికే వలస కూలీలను సోంత ప్రాంతాలకు తరలించారు, అలాగే ప్రత్యేక రైళ్లని ఏర్పాటు చేశారు.. అందుకే ఇక చిక్కుకున్న వారికి ఇబ్బంది ఉండదు అని భావిస్తున్నారు, ఇక మన దేశంలో 1.50 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది, అయితే ఇప్పుడు ఉన్న రెడ్ జోన్ కంటైన్మెంట్ జోన్లలో పూర్తిగా ఆంక్షలు ఉంటాయి.

కర్ఫ్యూ కొనసాగుతుంది అంటున్నారు, ఇలా ఇప్పుడు నాల్గవదశ ఎలా కొనసాగుతుందో , ఐదవ దశ లాక్ డౌన్ కూడా అలాగే కొనసాగుతుంది అంటున్నారు, పూర్తిగా ప్రజారవాణా వదలరు, షాపింగ్ మాల్స్, థియేటర్లు ఓపెన్ చేయరు, పార్కులు మ్యూజియంలు ఇలాంటివి ఏమీ ఓపెన్ చేయరు.