కూలీల కోసం ఈ యజమాని చేసిన పని తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు

కూలీల కోసం ఈ యజమాని చేసిన పని తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు

0
34

మన ఎదుగుదలకు పని చేసి సాయం చేసే వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు, కాయకష్టం చేసే వారి వల్ల మన దేశం ఇలా ఉంది అని మర్చిపోకూడదు, రైతులు కర్షకులు కార్మికుల వల్ల మన దేశం ఆర్ధికంగా ముందుకు సాగుతోంది, అయితే ఈ లాక్ డౌన్ వేళ వారే అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు, వలస కూలీలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు కాలినడకను ఎంచుకున్నారు.

అంతేకాదు తినడానికి తిండి లేక ఉపాది లేక అనేక ఇబ్బందులు పడి అక్కడ ఉండలేక సొంత గ్రామాలకు వెళుతున్నారు.ఒక యజమాని తన దగ్గర పని చేసిన వలస కూలీల కోసం ఏకంగా విమానం టికెట్ లు బుక్ చేసారు. ఆయన చేసిన పనికి అందరూ ఆయనని ప్రశంసిస్తున్నారు.

ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న వలస కూలీలు ఈ విషయాన్ని ఐజిఐ విమానాశ్రయంలో మీడియాకు తెలిపారు. పప్పన్ గాహ్లాట్ అనే ఒక యజమాని తన దగ్గర పని చేస్తున్న పది మంది వలస కూలీలకు విమాన టికెట్ లు కొని సొంత ఊర్లకు పంపించాడు…దాదాపు తమ కోసం లక్ష రూపాయలు ఖర్చు చేశారు అని తెలిపారు వారు…. మేము ఆయన దగ్గర 20 ఏళ్లుగా పని చేస్తున్నాం, ఆయన పరిశ్రమ తీయలేదు అందుకే తమకి ఇలా సాయం చేసి పంపించారు అని ఆయన గురించి తెలిపారు. మేము మొదటిసారి విమానం ఎక్కుతున్నాం అని తెలిపారు ఆ కూలీలు.