ఆ 13 సిటీస్ పై కేంద్రం గురి మిగిలిన చోట రిలీఫ్ ?

ఆ 13 సిటీస్ పై కేంద్రం గురి మిగిలిన చోట రిలీఫ్ ?

0
33

లాక్ డౌన్ 4 ఇక రేపటితో ముగుస్తుంది ఈ సమయంలో కేంద్రం మరి లాక్ డౌన్ 5 అమలు చేస్తుందా లేదా ఏ నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఎదురుచూస్తున్నారు, ఇక సినిమా హల్స్ మాల్స్ ఇప్పుడు ఓపెన్ చేసే ఆలోచనలో కేంద్రం లేదు, దానికి కేంద్రం ఇప్పుడు పర్మిషన్ ఇవ్వదు అని అంటున్నారు, అయితే కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ పూర్తిగా అమలు చేయాలి అని చూస్తున్నారు.

జూన్ 1 నుండి దేశంలోని చాలా ప్రాంతాలలో లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని 13 నగరాలు మినహా మిగతా అన్నిచోట్లా ఆంక్షలను ఎత్తివేయవచ్చని వార్తలు వస్తున్నాయి. హోటళ్ళు, , రెస్టారెంట్లను కూడా జూన్ 1 నుండి తెరవడానికి అనుమతినిస్తారని తెలుస్తోంది, పూర్తిగా రెస్టారెంట్లు తెరచుకున్నా, కేవలం పార్శిల్స్ కొన్ని రోజులు ఇస్తారు అని తెలుస్తోంది.

అన్నీ స్టేట్స్ ముఖ్యమంత్రులతో చర్చించారు, దీనిపై కీలక ప్రకటన నేడు రానుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, థానే, పూణే, హైదరాబాద్, కోల్కతా, హౌరా, ఇండోర్, జైపూర్, జోధ్పూర్, చెంగల్పట్టు, తిరువల్లూరు నగరాల్లో లాక్డౌన్ ఆంక్షలను కొంతకాలం కొనసాగించనున్నారట.