తెలంగాణలో స్కూల్స్ ఎప్పుడు తెరుస్తారు ?

తెలంగాణలో స్కూల్స్ ఎప్పుడు తెరుస్తారు ?

0
34

ఈ వైరస్ లాక్ డౌన్ వేళ విద్యాలయాలు, కాలేజీలు ,స్కూళ్లు ,ఎప్పుడు తెరుస్తారు అని అందరూ ఎదురుచూస్తున్నారు, ఓ పక్క కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో కాస్త ఇప్పుడిప్పుడే జనాలు బయటకు వస్తున్నారు, అయితే ఈ జూన్ నుంచి స్కూల్లు ప్రారంభం కావాలి ,కాని ఇంకా పది పరీక్షలు పూర్తి కాలేదు తాజాగా తెలంగాణలో పది పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది.

అయితే మరి స్కూల్స్ ఎప్పుడు తెరచుకుంటాయి అనేదానిపై క్లారిటీ అయితే రావాల్సి ఉంది..తెలంగాణలో ఈ నెల 8వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. అందువల్ల పరీక్షలు జరిగే సమయంలో బడులు తెరిచే అవకాశం లేదు. ఇక ఆ తర్వాత అంటే జూలై 5 తర్వాత స్కూల్స్ తెరిచే అవకాశం ఉంటుంది అంటున్నారు.

ముందు 8, 9, 10 విద్యార్థులకు తరగతులను ప్రారంభించాలని భావిస్తోందట సర్కార్ . దానివల్ల భద్రతాపరంగా లోపాలుంటే బయటపడే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రైమరీ స్కూల్స్ తెరవాలి అని భావిస్తున్నారు.. ఇక ఎక్కువసారిగా బయటకు స్కూల్ అయ్యాక పిల్లలను పంపకండా బ్యాచుల వారీగా పంపడం, మాస్క్ ధరించడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు.