ఒంటెపాలు లీటర్ ఎంతో తెలుసా ఆరోగ్యానికి మేలేనా?

ఒంటెపాలు లీటర్ ఎంతో తెలుసా ఆరోగ్యానికి మేలేనా?

0
27

ఒంటెని చూస్తే అత్యంత పొడవుగా ఉంటుంది . ఎడారుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ముఖ్యంగా రాజస్ధాన్ ప్రాంతాల్లో మన దేశంలో ఎక్కువ ఒంటెలు ఉంటాయి. చాలా మంది హైదరాబాద్ లో ఒంటెలను పెంచుతూ ఉంటారు, అలాగే రాజస్ధాన్ నుంచి ఇక్కడకు కొందరు వలస వచ్చి ఒంటె పాలుకూడా అమ్ముతూ ఉంటారు..

ఇవి వారికి ఉపాధిగా నగరంలో ఉంటోంది. ఒంటె పాలు లీటర్ రూ.600కు అమ్ముతున్నారు.
బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఒంటె పాలు ఆహారంగా ఇస్తుంటే వారిలో బుద్ధి వికసించి మంచిగా మసులుకుంటారని అధ్యయానాల్లో తేలిందట, దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి, కొందరు ఒంటె పాలు తాగేందుకు ఇష్టపడతారు.

గోధుమలు లేక పాలతో చేసిన ఆహర పదార్థాల వలన కొంతమంది పిల్లలకు అలర్జీ వస్తోంది, అలాగే ఆవు, గేదె పాలతోను ఇదే సమస్య వస్తోంది, అలాంటి వారికి ఈ ఒంటె పాలు ఇస్తే అలర్జీ తొలగిపోతుందని కొందరు వైద్యులు గ్రహించారు, ఈ ఒంటె పాలు అందరూ కాకుండా డాక్టర్లు సజెస్ట్ చేసిన వారు మాత్రమే తాగితే మంచిది అంటున్నారు నిపుణులు..