మలద్వారంలో మందు బాటిల్ ? చివరకు ఏం చేశారంటే ? ప్లీజ్ ఎవరూ ఇలా చేయకండి?

మలద్వారంలో మందు బాటిల్ ? చివరకు ఏం చేశారంటే ? ప్లీజ్ ఎవరూ ఇలా చేయకండి?

0
53

కొందరు మందు బాబులు మద్యం మత్తులు ఏం చేస్తారో వారికే తెలియదు, తాగిన మత్తులో దెబ్బలు తగిలినా ఆ మత్తుకి నొప్పి తెలియదు, తర్వాత ఆ నొప్పి తీవ్రత మరింత పెరుగుతుంది. తాజాగా తమిళనాడు నాగపట్నం లోని నాగూరు చెందిన 29 ఏళ్ల యువకుడికి మలద్వారంలో చిక్కుకుపోయిన మద్యం బాటిట్ ను సర్జరీ ద్వారా తొలగించారు వైద్యులు. ఇంతకీ ఏం జరిగింది అంటే…

ఇక్కడ నాగూరుకి చెందిన ఓ యువకుడు మద్యం అలవాటు బాగా చేసుకున్నాడు, అయితే నిన్న మద్యం తాగి ఆ సమయంలో ఓ క్వార్టర్ మద్యం బాటిల్ మల ద్వారం దగ్గర పెట్టుకున్నాడు, అది ఎంత తీసినా బయటకు రాలేదు, ఆ సమయంలో మొత్తం లోపలికి నెట్టేశాడు, ఆ నొప్పి అప్పుడు తెలియలేదు.

రాత్రి మాత్రం మద్యం మత్తు వదిలి చూస్తే నొప్పి తీవ్రంగా ఉంది, వెంటనే ఆస్పత్రికి వెళితే వారు కరోనా టెస్టు చేసిన తర్వాత ఆపరేషన్ చేయాలి అని భావించారు, కాని అది గాజు ఒకవేళ పగిలితే ప్రాణాలకు ప్రమాదం అని వెంటనే సర్జరీ చేశారు, ఇప్పుడు వారం ఆస్పత్రిలో ఉండాలి అని చెప్పారు డాక్టర్లు, చూశారుగా పిచ్చ పనులు మద్యం తీసుకున్నప్పుడు చేస్తే ఇలాగే ఉంటుంది.