బిగ్ బ్రేకింగ్ రైతులకు మోదీ గుడ్ న్యూస్ తప్పక తెలుసుకోండి

బిగ్ బ్రేకింగ్ రైతులకు మోదీ గుడ్ న్యూస్ తప్పక తెలుసుకోండి

0
36

నరేంద్రమోదీ సర్కార్ రైతులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. పీఎం కిసాన్ యోజన ద్వారా రైతులకి సాయం చేస్తున్నారు, కేంద్రం రైతులకి రుణాలు అందిస్తోంది, చిన్నకారు సన్నకారు రైతులకి చేదోడుగా ఉంటోంది, అయితే తాజాగా ఈ లాక్ డౌన్ వేళ అన్నీ రంగాలతో పాటు వ్యవసాయ రంగానికి కూడా ఉపశమన ప్యాకేజీలు ప్రకటించింది కేంద్రం.

ఈ సమయంలో రైతులకి గుడ్ న్యూస్ చెప్పింది. రైతులు తీసుకునే వ్యవసాయ రుణాలు చెల్లింపునకు కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 31 వరకు గడువు పొడిగించింది. రూ.3 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుంది. మోదీ సర్కార్ పంట రుణాల చెల్లింపు గడువును ఆగస్ట్ 31 వరకు పెంచడంతో రైతులు ఆనందంలో ఉన్నారు.

కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలపై వడ్డీ రేటు కేవలం 4 శాతం మాత్రమే. అయితే ఇది అందరికీ వర్తించదు. తీసుకున్న రుణాలను కరెక్ట్ టైములో కడితేనే వారికి తక్కువ వడ్డీ ఉంటుంది, గతంలో మార్చి నుంచి మే నెలకి సమయం ఇచ్చారు, లాక్ డౌన్ కారణంతో, ఇప్పుడు మే నుంచి ఆగష్టు వరకు కేంద్రం గడువు ఇచ్చింది. మీరు ఆగష్టులో చెల్లించినా నాలుగు శాతం మాత్రమే వడ్డీ పడుతుంది.