హోమ్ క్వారెంటైన్లో ఉన్నవారు బయటకు వస్తే ఇక అంతే ఇలా ట్రాక్ చేస్తారు

హోమ్ క్వారెంటైన్లో ఉన్నవారు బయటకు వస్తే ఇక అంతే ఇలా ట్రాక్ చేస్తారు

0
30

ఈ వైరస్ లాక్ డౌన్ వేళ ప్రయాణికులు ఒక చోట నుంచి మరో చోటకి వెళుతున్నారు, అయితే ఇప్పుడు ఇది పెద్ద సమస్య అయింది అధికారులకి.. ముఖ్యంగా లాంగ్ జర్నీలు బస్సులు రైళ్లలో వచ్చే ప్రయాణికులకు వైరస్ టెస్టులు చేస్తున్నారు వైద్య సిబ్బంది.. ఒకవేళ వారికి పాజిటీవ్ వస్తే ఆస్పత్రికి తీసుకువెళుతున్నారు. నెగిటీవ్ వస్తే వారికి స్టాంప్ వేసి హొం క్వారంటైన్ కి తరలిస్తున్నారు.

మరి ఇంటికి వెళ్లిన వారుస్టాంప్ వేసినా నిబంధనలు పాటించకుండా బయటకు వస్తున్నారు, అందుకే
హోమ్ క్వారెంటైన్లో ఉన్నవారి వివరాలు M55 పోర్టల్లో ఉంటాయి. ఆ జాబితా సంబంధిత మెడికల్ అధికారులు, ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్, వార్డ్ వాలంటీర్, వార్డ్ ఏఎన్ఎంల దగ్గర ఉంటాయి. ఆ సిబ్బంది హోమ్ క్వారెంటైన్లో ఉన్నవారి ఇళ్లకు వెళ్తారు.

ఈ డేటా అంతా ఎక్కడ ఉన్నా వారి దగ్గర ఉంటుంది, ఆరోగ్యసేతు యాప్ కూడా వేసుకుంటారు, దీని వల్ల అతని కదలికలు తెలుస్తాయి, అందుకే బయటకు వెళ్లనివ్వరు..ఈ డేటా సమీప పోలీస్ స్టేషన్లో కూడా ఉంటుంది. ప్రతీ మూడు రోజులకోసారి సబ్ సెంటర్ ఏఎన్ఎం కూడా హోమ్ క్వారెంటైన్లో ఉన్నవారి ఇళ్లకు వెళ్తారు. ఇలా వారు ట్రాక్ చేస్తున్నారు. అందుకే ఎవరూ బయటకు రాకుండా 14 రోజులు ఇంటిలో ఉండాలి అని చెబుతున్నారు వైద్యులు.