బిగ్ న్యూస్ – కుటుంబం చేసిన తప్పుకి ఆరు లక్షల ఫైన్

బిగ్ న్యూస్ - కుటుంబం చేసిన తప్పుకి ఆరు లక్షల ఫైన్

0
27

ఈ కరోనా సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి… లేకపోతే కచ్చితంగా ఇబ్బందే, ఈ వైరస్ నిబంధనలు పాటించకపోతే మాస్క్ ధరించకపోయినా ఎవరికి అయినా వైరస్ సోకచ్చు, అ్ందుకే ఈ లాక్ డౌన్ సమయంలో వివాహాలు కూడా వాయిదా వేసుకోవాలి అని అధికారులు చెబుతున్నారు.

కాని కొంత మంది ఇష్టం వచ్చినట్లు బంధువులని పిలిచి వివాహాలు చేస్తున్నారు, ఈ సమయంలో సరైన ప్రమాణాలు నిబంధనలు పాటించడం లేదు… దీంతో చాలా మందికి వైరస్ సోకుతోంది, రాజస్ధాన్ లో భిల్వారా జిల్లాకు చెందిన గీసులాల్ తన కుమారుడికి ఘనంగా పెళ్లి జరిపించాడు.

నిబంధనలు పాటించలేదు దీంతో పెళ్లికి వచ్చిన వారికి 15 మందికి వైరస్ వచ్చింది.. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ కుటుంబానికి అధికారులు ఏకంగా ఆరు లక్షల రూపాయల ఫైన్ విధించారు..వీరికి కరోనా పరీక్షల నిర్వహణ, చికిత్స, ఆహారం, అంబులెన్స్ వాటికి మొత్తంగా రూ.6,26,600 అయింది ఈ నగదు అంతా ఆ కుటుంబం నుంచి వసూలు చేయాలి అని తెలిపారు.