వర్షాకాలంలో నిమ్మ జామ బత్తాయి తింటే జలుబుచేస్తుందా నిజమెంత

వర్షాకాలంలో నిమ్మ జామ బత్తాయి తింటే జలుబుచేస్తుందా నిజమెంత

0
29

ఈ ప్రపంచంలో అపోహలు ఎన్నో ఉంటాయి, ఎవరైనా ఏదైనా చెబితే అందులో నిజం ఎంతో తెలుసుకోకుండానే దానిని నమ్మేస్తారు, నిజం గడపదాటేలోపు అబద్దం ఊరు అంతా పాకేస్తుంది. అందుకే సైన్స్ విషయాలు కొన్ని నమ్మాలి మూడనమ్మకాలు వదిలెయ్యాలి, అయితే ఈ వర్షాకాలంలో తీసుకునే ఆహరం చాలా మంచిది తీసుకోవాలి.

ఈ సమయంలో ఇన్ ఫెక్షన్ జ్వరాలు దగ్గు జలుబు లాంటి సమస్యలు ఉంటాయి, అందుకే అతి జాగ్రత్తగా ఉండాలి, ఈ సమయంలో చాలా మంది ఓ మాట అంటారు, నిమ్మకాయ బాగా పండిన జామకాయ బత్తాయి సంత్రాలు ఇలాంటివి తింటే జలుబు చేస్తుంది అందుకే ఇవి తినద్దు అంటారు.

ఇందులో ఏమాత్రం నిజం లేదు.. జామ బత్తాయి నిమ్మ ఈ వర్షాకాలం ఎక్కువ తీసుకోవాలి, బాడీకి మంచిది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అయితే వీటిని జ్యూస్ చేసుకుని తాగితే కచ్చితంగా ఐస్ లేకుండా కాచి చల్లార్చిన నీటితో తాగాలి …అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు, లేకపోతే జలుబు చేసే ప్రమాదం ఉంటుంది.. అది కూడా ఆ నీటి వల్ల అంతేకాని ఆ పండ్ల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది అపోహ అంటున్నారు నిపుణులు.