వంకాయ తింటే కలిగే 10 ప్రయోజనాలు ఇవే

వంకాయ తింటే కలిగే 10 ప్రయోజనాలు ఇవే

0
46

ఆహా ఏమి రుచి తినరా మైమరిచి ….రోజూ తినాలనే కూర ఇది అంటారు పెద్దలు, అవును వంకాయ పచ్చడి, వంకాయ బజ్జీ, వంకాయ మసాలా, గుత్తి వంకాయకూర, అలాగే వంకాయ అల్లం కూర్మా, ఇలా వంకాయతో ఏ కూర చెప్పినా నోట్లో లాలాజలం ఊరుతుంది, అంత బాగుటుంది వంకాయ, చాలా చోట్ల వంకాయ బజ్జీలు కూడా అమ్ముతారు.

అయితే వంకాయతో చేసే వంటకాలు అన్నీ ఇన్నీ కావు.. ఇప్పుడు వంకాయ పకోడి ఆవకాయ కూడా పెడుతున్నారు, అయితే ఇది శరీరానికి మంచిదే అంటున్నారు వైద్యులు…వంకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాంటీ వైరల్ మరియు యాంటీ బాక్టీరియా లక్షణాలు కూడా ఇందులో ఉంటాయి.

ఇది శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు అనేక రోగాలతో పారాడేందుకు తోడ్పతుంది. ఇక వంకాయ ఎంత తిన్నా ఒళ్లురాదు ఎందుకు అంటే ఇందులో కొవ్వుశాతం తక్కువ,ఫ్యాట్ ఉన్న వారు వంకాయ తింటే బరువు తగ్గచ్చు, ఇందులో పీచు పదార్ధం ఎక్కువ సో ఈజీగా జీర్ణం అవుతుంది.

వంకాయల్లో ఉండే పోలిఫినాల్స్ రక్తంలో షుగర్ లెవెల్స్ను నియంత్రిస్తుంది. అంతేకాకుండా.. వంకాయను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగ ఉప్పుతో తింటే.. గాస్ ట్రబుల్, ఎసిడిటీ, కఫము తగ్గుతాయి. ఇక వంకాయని కొంత మంది తింటే శరీరం పై దద్దుర్లు దురద వస్తుంది అంటారు ఎవరికి అయినా ఇలాంటి అలర్జీ ఉంటేమాత్రం దీనికి దూరంగా ఉండాలి అని చెబుతున్నారు నిపుణులు.