బ్లాక్ టీ తాగుతున్నారా ? అయితే ఇది తప్పక తెలుసుకోండి

బ్లాక్ టీ తాగుతున్నారా ? అయితే ఇది తప్పక తెలుసుకోండి

0
54

ఉదయం లేవగానే టీ లేకపోతే, అసలు పని చాలా మంచి చేయలేరు.. ముందు బండి నడవాలి అంటే ఓ గ్లాసు టీ తాగాల్సిందే, అయితే గ్రీన్ టీ తాగేవారు కొందరు ఉంటారు. అలాగే బ్లాక్ టీ తాగేవారు కొందరు ఉంటారు.

ముఖ్యంగా బ్లాక్ టీ తాగడం వల్ల క్యావిటీలను కలిగించే బ్యాక్టీరియా.. నోటి నుంచి తొలగిపోతుంది. అలాగే బ్లాక్ టీలోని పాలిఫినాల్స్ పళ్ల పిప్పిని తొలగిస్తాయి. ఇక ఎముకలకు కూడా ఇది చాలా మంచిది.
ఇక పెద్ద వారిలో కనిపించే అర్థరైటిస్ వంటి వ్యాధులు కూడా దూరం చేస్తాయి.

ఈ నవీన యుగంలో ఆఫీసులు వ్యాపారాలు చేసే వారు చాలా మంది ఈ బ్లాక్ టీ తాగుతున్నారు, ముఖ్యంగా రోజూ ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ టీ తాగితే 70 శాతం మేర డయాబెటిస్ వచ్చే ముప్పు తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు టైప్ 2 డయాబెటిస్ని రాకుండా చేస్తాయి. ఇక ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న ఒత్తిడి మానసిక ఆందోళన కూడా దూరం చేస్తుంది.. వైరల్ ఫీవర్స్ లాంటివి రాకుండా నిరోధిస్తాయి. ఇక బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.