స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర వెండి షాక్ – ఈరోజు రేట్లు ఇవే

స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర వెండి షాక్ - ఈరోజు రేట్లు ఇవే

0
28

గ‌డిచిన రెండు నెల‌లుగా పెరిగిన బంగారం ధ‌ర మ‌ళ్లీ నేల చూపులు చూస్తోంది. బంగారం ధ‌ర మ‌ళ్లీ పడిపోయింది. రెండు రోజులుగా త‌గ్గుతూ వ‌స్తోంది పసిడి.. తాజాగా నేడు ధర భారీగా దిగొచ్చింది. అయితే ఎన్న‌డూ లేనిది మార్కెట్లో వెండి కూడా పెరిగింది నేడు బంగారం ధ‌ర త‌గ్గితే వెండి ధ‌ర కాస్త పెరిగింది, మార్కెట్లో రేట్లు చూద్దాం

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 దిగొచ్చింది. దీంతో ధర రూ.48,850కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.30 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.53,290కు చేరింది.

పసిడి ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది…కేజీ వెండి ధర ఏకంగా రూ.890 పెరిగింది. దీంతో ధర రూ.68,100కు చేరింది. ఇక వెండి ధ‌ర కూడా ఈరోజు భారీగా పెరిగింది. , నిన్న‌టి కంటే మార్కెట్లో భారీగా వెండి ధ‌ర పెరిగింది..ఇక వ‌చ్చే రోజుల్లో వెండి రేటు త‌గ్గే అవ‌కాశం ఉంది అంటున్నారు నిపుణులు, ఇక బంగారం ధ‌ర కూడా వ‌చ్చే రోజుల్లో మ‌రింత త‌గ్గుతుంది అంటున్నారు నిపుణులు.