ఉదయం మజ్జిగ తీసుకుంటే మీకు ఎన్ని లాభాలో తెలుసా ? ఈ సమస్యలు ఉండవు

ఉదయం మజ్జిగ తీసుకుంటే మీకు ఎన్ని లాభాలో తెలుసా ? ఈ సమస్యలు ఉండవు

0
36

ఏ మనిషి అయినా ఆరోగ్యంగా ఉన్నాడు అంటే కచ్చితంగా అతను మంచి ఆహార నియమాలు వాకింగ్ జాకింగ్ జిమ్ వ్యాయామం ఇలా అన్నీ సక్రమంగా చేస్తున్నాడు అని అర్ధం, అన్నం మితంగా తినాలి దానికి తగ్గా పని చేయాలి అంటారు వైద్యులు అందుకే.

అయితే మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ప్రభావితం చేస్తాయి. పాల పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతాయని తెలిసిన విషయమే. కాఫీలు టీలు కంటే చల్లని మజ్జిగ కుండ మజ్జిగ ఎంతో మేలు, అంతేకాదు చలువ కూడా చేస్తుంది.

డైట్ పాటించేవారు ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాసు మజ్జిగ తీసుకుంటే కావాల్సిన శక్తి అందుతుంది. కేలరీలు, కొవ్వుశాతం తక్కువగా ఉంటాయి. కొవ్వుపేరుకుపోయి ఉంది అని భయం ఉంటే ఇలా తాగండి మీకు ఫ్యాట్ ఈజీగా తగ్గుతుంది.

ఉదయం టిఫిన్ మితంగా తీసుకుని మజ్జిగ తీసుకోండి, జీర్ణ వ్యవస్ధ బాగుంటుంది, ఎలాంటి మసాలా నాన్ వెజ్ తిన్నా ఉదయం మజ్జిగ తీసుకుంటే శరీరంలో మలినాలు బయటకు వస్తాయి మలబద్దకం జీర్ణ సంబంధ వ్యాధులు ఉండవు.

కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, సమస్యలు ఉండవు. చల్లని మజ్జిగలో అల్లం రసం కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి.హైబీపీ ఉన్నవారు ఉదయాన్నే మజ్జిగ తాగితే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఇక ఫ్రిజ్ లో పెట్టి పెరుగు మజ్జిగ తీసుకోవద్దు, అతి చల్లటి పెరుగు మజ్జిగ వాడద్దు, కుండలో పెరుగు మజ్జిగ మేలు, ఫ్రిజ్ లో పెరుగు మజ్జిగని దూరం పెట్టండి.