మీ శరీరానికి విటమిన్ డీ అందాలంటే ఈ ఫుడ్ తీసుకోండి

మీ శరీరానికి విటమిన్ డీ అందాలంటే ఈ ఫుడ్ తీసుకోండి

0
34

ఈ కరోనా సమయంలో చాలా మంది ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరీ ముఖ్యంగా విటమిన్ సీ అలాగే విటమిన్ డీ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటున్నారు, అయితే విటమిన్ డీ ఏ ఆహారంలో ఉంటుంది పుష్కలంగా? ఎలాంటి ఫుడ్ లో ఉంటుంది అనేది చాలా మంది తెలుసుకుంటున్నారు.

మరి ఏ ఆహారం తీసుకుంటే మనకు విటమిన్ డీ పుష్కలంగా వస్తుందో వైద్యులు చెబుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం, కాస్త ఎండలో తిరుగుతూ ఉండేవారికి విటమిన్ డీ లోపం రాదు అయితే , ఇలా సూర్యరశ్మిద్వారా పొందని వారు మందుల ద్వారా పొందవచ్చు.

కొన్ని ఆహారపదార్థాల ద్వారా శరీరానికి విటమిన్ డీ అందేలా చూడవచ్చు. మరి ఆ ఆహార పదార్థాలేంటో చూద్దాం..పాలు, పాల పదార్థాలు..పెరుగు, వెన్న.కోడిగుడ్లు…సాల్మన్, ట్యూనాలాంటి చేపల్లో విటమిన్ డీ ఉంటుంది. మష్రూమ్స్లో ఫ్యాట్ తక్కువ, ఇందులో విటమిన్ డీ ఉంటుంది..
గోధుమలు, బార్లీ, రాగులు, ఓట్స్ లో కూడా విటమిన్ డీ లభిస్తుంది. అందుకే మీ డైట్ లో ఈ ఫుడ్ ఉండేలా చూసుకోండి.