తరచూ దగ్గు రాకుండా ఉండాలి అంటే ఈ ఆహారాలకు ఫుల్ స్టాప్ పెట్టండి

తరచూ దగ్గు రాకుండా ఉండాలి అంటే ఈ ఆహారాలకు ఫుల్ స్టాప్ పెట్టండి

0
33

చాలా మంది తరచూ దగ్గు సమస్యతో బాధపడుతూ ఉంటారు, ఏకంగా ప్రతీ పది రోజులకి కూడా వేధిస్తూ ఉంటుంది, అయితే ఇలా ఇబ్బందిపెడుతోంది అంటే కచ్చితంగా ముందు మీరు తినే ఆహారంలో కొన్ని ఆహారాలు పక్క నపెట్టండి, అలాగేఅస్సలు నూనె ఆహార పదార్దాలు తీసుకోవద్దు.

మరి ఏఫుడ్ తినకుండా ఉంటే మంచిది దగ్గు సమస్య రాదు అంటే.. మరి ఇప్పుడు వైద్యులు చెప్పేది చూద్దాం.. ఆయిల్ లో ఫ్రై చేసిన బంగాళాదుంప చిప్స్, ప్రాసెస్ చిప్స్, ఆయిల్ లో డీప్ ఫ్రై చేసిన చికెన్ ఫిష్, అలాగే బిస్కెట్లు బటర్ తో చేసినవి, అస్సలు తీసుకోవద్దు.

గోదుమ బిస్కెట్లు తీసుకోవచ్చు, మైదా పిండితో చేసిన బజ్జీలు చల్ల అట్లు ఇలాంటివి అస్సలు తీసుకోవద్దు, మీరు తినే బజ్జీలు చిప్స్ ఇవన్నీ పామాయిల్ తో చేస్తారు కనుక మరింత దగ్గు పెరుగుతుంది, అంతేకాదు అవుట్ సైడ్ ఫుడ్ కాక నూనెతో చేస్తారు ఇది దగ్గును మరింత పెంచుతుంది. ఇలాంటి ఫుడ్ దూరం చేయండి.

మరి దగ్గు తగ్గాలి అంటే కషాయం, అలాగే తులసి ఆకులు రోజుకి రెండు లేదా మూడు తీసుకున్నా గొంతు దగ్గర ఇబ్బంది తొలగిపోతుంది, గోరు వెచ్చని నీరు మాత్రమే తాగండి చల్లటి నీరు అస్సలు వద్దు.