భారీగా పెరిగిన బంగారం వెండి ధ‌ర‌లు – ఈరోజు రేట్లు ఇవే

భారీగా పెరిగిన బంగారం వెండి ధ‌ర‌లు - ఈరోజు రేట్లు ఇవే

0
29

బంగారం ధ‌రల‌‌కు మ‌ళ్లీ రెక్క‌లు వ‌చ్చాయి… గ‌డిచిన వారం రోజులుగా డైలీ త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర మళ్లీ ప‌రుగులు పెట్టింది, ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్లో గోల్డ్ ధ‌ర పెరిగింది. దీంతో బంగారం ధ‌ర ఇండియాలో పెరుగుతోంది. మ‌రి నేడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 పైకి కదిలింది. దీంతో ధర రూ.53,850కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.280 పెరిగింది. దీంతో ధర రూ.49,370కు చేరింది.

పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర గత ఏకంగా రూ.700 పైకి కదిలింది. దీంతో వెండి ధర రూ.68,500కు చేరింది. వ‌చ్చే రోజుల్లో బంగారం వెండి ధ‌ర‌లు మ‌రింత పెరుగుతాయి అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు, గ‌డిచిన వారం రోజులుగా షేర్ల ర్యాలీ కొన‌సాగింది, అందుకే బంగారం త‌గ్గింది, ఇప్పుడు మళ్లీ షేర్ల ప‌త‌నంతో బంగారం ధ‌ర పెరుగుతోంది.