బ్రేకింగ్ – రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీతో సైడ్ ఎఫెక్ట్స్ షాక్ లో వాలంటీర్లు

బ్రేకింగ్ - రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీతో సైడ్ ఎఫెక్ట్స్ షాక్ లో వాలంటీర్లు

0
41

ఈ క‌రోనా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది, ఎప్పుడు వ్యాక్సిన్ వ‌స్తుందా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు, అయితే అంద‌రి కంటే ముందు క‌రోనా వ్యాక్సిన్ తీసుకువ‌చ్చింది ర‌ష్యా .. ఈ రేసులో ముందున్న రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్-వీపై అందరు ఆశలు పెట్టుకున్నారు. కొంద‌రు ఈ వ్యాక్సిన్ పై భిన్న అభిప్రాయాలు వ్య‌క్త ప‌రిచారు.

అయితే తాజాగా దీనిపై రష్యా ఆరోగ్య శాఖ మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు వచ్చాయని తెలిపారు..మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న 300 మంది వాలంటీర్లలో 14 శాతం మంది వాలంటీర్లకు ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరం వంటి సమస్యలు వచ్చాయని చెప్పారు.

కాని ఇవి తాము ముందు అనుకున్న‌వే అని అంటున్నారు, కాని ఇవి రెండు మూడు రోజుల్లో త‌గ్గిపోతాయ‌ని తెలిపారు, ఇక వాలంటీర్ల ఆరోగ్యం పై ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రీక్ష‌లు చేస్తున్నారు, అయితే
వ్యాక్సిన్ వేయించుకున్న వారి కోసం ఓ యాప్‌ను రూపొందించారు. ఒక వేళ అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆ యాప్‌ ద్వారా తెలియజేయాలని చెప్పారు. మొత్తానికి ఇవి రెండు మూడు రోజుల‌కి త‌గ్గ‌క‌పోయినా మ‌ళ్లీ శ‌రీరంపై క‌నిపిస్తున్నా కాస్త మ‌రింత లోతుగా ప‌రిశోధ‌న చేయాలి అంటున్నారు నిపుణులు.