ప్రేమ పెళ్లి చేసుకున్నాడు తీసుకువెళ్లి నదిలో తోసేశాడు…

ప్రేమ పెళ్లి చేసుకున్నాడు తీసుకువెళ్లి నదిలో తోసేశాడు...

0

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపాలనుకున్నాడు భర్త ఈ దారుణం కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ మర్రిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… పత్తి భాస్కర్ హైదరాబాద్ లోని ఇంటెలిజెన్స్ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు… అక్కడ రామలక్ష్మీ అనే అనాథ యువతి బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది..

ఆమెతో భాస్కర్ పరిచయం పెంచుకున్నాడు కొన్ని రోజుల తర్వాత ఈ పరిచయం కాస్త ప్రేమగా మరింది… దీంతో వీరిద్దరు 2016లో వివాహం చేసుకున్నారు… కొంత కాలంపాటు భార్య భర్తలు సంతోషంగా ఉన్నారు.. అయితే ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ భార్యను వదిలించుకోవాలని భావించాడు…

అనున్న ప్లాన్ ప్రకారం భార్యను నమ్మించి బైక్ పై తీసుకువెళ్లి సమీపంలో ఉన్న కుందూ నది వంతెనపై ఆపి సెల్ఫీ తీసుకుందామని నమ్మబలికి అమెను నదిలో తోసేశాడు… దీంతో అనుమానం రాకుండా బైక్ తోపాటు భాస్కర్ కూడా దూకాడు అయితే భాస్కర్ కు ఈత రావడంతో అతన్ని రక్షించారు… ఇక నదిలో కొట్టుకుపోతున్న రామలక్ష్మీ కేకలు వేసింది దీన్ని విన్న రైతులు ఆమెను రక్షించారు.. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here