ఒకే బ్లడ్ గ్రూపు ఉన్న అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోకూడదా – ఈ సమస్యలు తప్పవా

ఒకే బ్లడ్ గ్రూపు ఉన్న అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోకూడదా - ఈ సమస్యలు తప్పవా

0
43

ఒకే కులంలో పెళ్లి చేసుకునే వారు కూడా చాలా మంది ఒకే గోత్రం ఉండకూడదు అనే సెంటిమెంట్ చెబుతారు, ఇక మేనమామ గోత్రాలు సెట్ అవ్వాలి అని కొందరు అంటారు, ఇలా చాలా మంది చాలా రకాల కారణాలు చెబుతారు, అయితే ఇప్పుడు ఈ నవీన సమాజంలో కులాలు మతాల లెక్కలు చాలా మంది పక్కన పెట్టారు, అయితే ఓ వార్త మాత్రం ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మరీ ముఖ్యంగా ఆ అంశం ఏమిటి అంటే .. ఇప్పుడు చాలా మంది వైద్యులని ఓ ప్రశ్న అడుగుతున్నారట, ఒకే బ్లడ్ గ్రూపు ఉంటే వివాహం చేసుకోకూడదా; ఇలా చేసుకుంటే పిల్లలు పుడితే ఇబ్బందులు వస్తాయి అని వార్తలు వింటున్నాం. ఇది నిజమేనా అని చాలా మంది వైద్యులని అడుగుతున్నారు.

అయితే వైద్యులు దీనిపై ఓ క్లారిటీ ఇచ్చారు, ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకున్నా ఎటువంటి అనారోగ్యాలూ ఉండవు అని డాక్టర్లు చెబుతున్నారు. భార్య భర్తలు ఇద్దరిదీ ఒకే రకం బ్లడ్ గ్రూప్ అయితే భార్యది లేదా భర్తది ఒకటే కాబట్టి పిల్లలకు అదే గ్రూపు రావచ్చు, ఒకవేళ ఇద్దరూ వేరే గ్రూపులు అయితే మాత్రం ఇద్దరిలో ఒకరిది పిల్లలకు వస్తుంది. పెళ్లికి ఇలా బ్లడ్ గ్రూపుకి ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు వైద్యులు.