వైకుంఠ ఏకాదశి రోజు ఇలా పూజ చేస్తే ఎంతో పుణ్యం

వైకుంఠ ఏకాదశి రోజు ఇలా పూజ చేస్తే ఎంతో పుణ్యం

0
196

ముక్కోటి ఏకదాశి లేదా వైకుంఠ ఏకాదశి ఈ రోజు ఎంతో భక్తితో స్వామికి పూజలు చేస్తారు, మరి చంద్రమానం, సౌరమానం కలయికతో జరుపుకునే వైకుంఠ ఏకాదశి అంటే 3 కోట్ల మంది దేవతలతో కలిసి… విష్ణుమూర్తి… భూలోకానికి విచ్చేసే అద్భుత ఘడియలు అని చెబుతారు.

అందుకే ఈరోజు భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం అని భావిస్తారు, ఏ దోషాలు ఉన్నా పోతాయి అని పెద్దలు చెబుతారు.. అందుకే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. నిర్మలమైన మనసుతో… జ్ఞానేంద్రియాలన్నీ లగ్నం చేసి పూజించాలి. స్వామికి పూజ చేసి వ్రతం ఆచరించి ఉపవాసం ఉంటే ఏ కోరిక కోరినా తీరుతుంది అంటారు.

ఈ రోజు చేసే పూజలు, దానాల వల్ల ఏడాదిలో ప్రతి ఏకాదశికీ చేసినంత పుణ్యం దక్కుతుంది. ఈరోజు ఏ పాపాలు చేయకుండా ఉండాలి..విష్ణుమూర్తి విగ్రహాన్ని ఉంచి.తులసి దళాలతో పూజించాలి. కొద్దికొద్దిగా పూల రేకులు స్వామిపై వేస్తూ స్వామిని కీర్తిస్తూ పూజ చేయాలి. దీని వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది.