ఫ్రిబ్రవరి 1 నుంచి ఇంటికే రేషన్ సరుకులు ఇవి కచ్చితంగా తెలుసుకోండి

0

ఏపీలో సంక్షేమ పథకాల అమలులో వైయస్ జగన్ సర్కారు దూసుకుపోతోంది.. రేషన్ సరుకులు ఇంటి వద్దకు అందించే పథకం అమలు చేస్తున్నారు, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం 9,260 వాహనాలు సిద్దం అయ్యాయి, ఇక రేషన్ దుకాణాల దగ్గరెవరూ ఎదురుచూడక్కర్లేదు నేరుగా ఇంటికి రేషన్ సరుకులు అందిస్తారు.

నూకలు కలిగిన బియ్యం రంగు మారిన బియ్యం జనాలు తీసుకోవడం లేదు వాటిని తినడం లేదు బయట అమ్మేస్తున్నారు ఇక ఇలాంటి ఇబ్బంది లేదు మంచి నాణ్యమైన బియ్యాన్ని అందించనుంది జగన్ సర్కార్… మిల్లింగ్ సమయంలోనే నూకలు శాతాన్ని బాగా తగ్గించి కార్డుదారులకు నాణ్యతతో కూడినవి అందించేలా చర్యలు చేపట్టింది.

నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగిస్తూ ఈ మొబైల్ రేషన్ డెలివరీ వాహానాలు అందచేశారు.
సీల్ వేసిన బియ్యం సంచులు ప్రజల ముందు తెరిచి వారికి బియ్యం అందచేస్తారు
వారి ముందు తూకం వేసి ఈ బియ్యం అందిస్తారు
బియ్యాన్ని కచ్చితమైన ఎలక్ట్రానిక్ తూకంతో పంపిణీ చేస్తారు.
కార్డుదారుని వేలి ముద్ర తీసుకుని వారికి బియ్యం ఇంటి దగ్గర పంపిణీ చేస్తారు
మొదటిసారి ఈ సంచులను ఉచితంగా ఇవ్వనున్నారు.
ప్రతి రోజూ సగటున 90 కార్డులకు తగ్గకుండా పంపిణీ చేయాలి
కచ్చితంగా నెలకి 18 రోజులు ఈ వాహనం వస్తుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here