ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం విడుదలకు ఆ డేట్ ని లాక్ చేస్తున్నారట

0

బాహుబలి సినిమా ప్రభాస్ కు ఎంతో పేరు తీసుకువచ్చింది.. ప్యాన్ ఇండియా స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా మార్చేసింది.. విదేశాల్లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది, ఇక అక్కడ నుంచి ప్రభాస్ ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.. అయితే తాజాగా ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఈ జనవరి ఎండింగ్ తో పూర్తి అవుతుంది.

తాజాగా ప్రభాస్ కూడా రాధేశ్యామ్ యూనిట్ సభ్యులకు ఖరీదైన రిస్ట్ వాచ్లను గిఫ్ట్గా ఇచ్చాడు. ఇక ఆదిపురుష్ సెట్స్ పై బిజీగా ఉండనున్నారు ప్రభాస్, అయితే మరి రాధేశ్యామ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదానిపై అభిమానులు ఎదురుచూస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది, ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ తేది సెంటిమెంట్ తేది అంటున్నారు.. ఎందుకు అంటే ఈ తేదిన బాహుబలి విడుదల అయి సంచలన విజయం నమోదు చేసింది. ఇక ఈ తేదిని నిర్మాతలు లాక్ చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది చిత్ర యూనిట్ నుంచి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here