బ్రేకింగ్ – ఏపీ తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే రైల్వే ప్రయాణికులు ఇది తెలుసుకోండి – 14 రోజుల క్వారంటైన్

బ్రేకింగ్ - ఏపీ తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే రైల్వే ప్రయాణికులు ఇది తెలుసుకోండి - 14 రోజుల క్వారంటైన్

0
48

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు దారుణంగా నమోదు అవుతున్నాయి.. ఎక్కడ చూసినా వేలాది పాజిటీవ్ కేసులు వస్తున్నాయి… ఏపీ తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది, అయితే తెలంగాణలో రాత్రి పూటకర్ఫ్యూ అమలు ఉంది, ఇక ఏపీలో కూడా కర్ఫ్యూ అమలు ఉంది..అయినా కేసులు తగ్గడం లేదు, ఇక తాజాగా కొందరు రైల్వే ప్రయాణాలు కూడా తగ్గించారు.

 

దక్షిణ మధ్య రైల్వే విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది. కచ్చితంగా ఇది అమలులోకి తీసుకువచ్చారు, ఇక ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రం పొందినవారు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా సర్టిఫికెట్ చూపించిన వారికి మాత్రం వారం రోజుల హోంక్వారంటైన్లో ఉంటే సరిపోతుందని తెలిపింది.

 

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా వస్తున్న నేపథ్యంలో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది… దీంతో చాలా మంది ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు… మరికొందరు పరీక్షలు చేయించుకుని ప్రయాణానికి సిద్దం అవుతున్నారు.