వంట నూనెల ధరల విషయంలో సామాన్యులకి గుడ్ న్యూస్

వంట నూనెల ధరల విషయంలో సామాన్యులకి గుడ్ న్యూస్

0
34

నెలలుగా పెట్రోల్ ధరలు పెరగడం గురించి మనం వార్తలు వింటూనే ఉన్నాం…. అలాగే వంట నూనెల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి…. ఎక్కడ చూసినా భారీగా ధర పెరుగుతోంది…..ఈ సమయంలో దేశ ప్రజలకు గుడ్ న్యూస్ రానుందట….అది ఏమిటి అంటే వంట నూనె ధరలు రానున్న రోజుల్లో తగ్గే అవకాశముంది.

 

 

వంట నూనె ధర గత ఏడాది కాలంలో రూ.55కు పైగా పెరిగింది.. పామాయిల్ ఏకంగా 150 లీటర్ ట్రేడ్ అవుతోంది.. ఇక సన్ ఫ్లవర్ 170 పైనే ఉంది.. ఇలా సామాన్యులకి ఈ నూనె రేటు చెబితే షాక్ అవుతున్నారు.. కాండ్లా, ముంద్రా పోర్ట్లలో నూనె స్టాక్ భారీగా నిలిచిపోయింది. ఈ స్టాక్కు అనుమతి లేకపోవడం వల్ల అలాగే పోర్ట్లలో చిక్కుకుపోయింది.

 

 

ఇప్పుడు ఈ స్టాక్కు క్లియరెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అంటే మార్కెట్లోకి ఎక్కువ నూనె అందుబాటులోకి రానుంది. సో దీంతో ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది లీటర్ కు 20 మేర తగ్గచ్చు అంటున్నారు. గత ఏడాది ఇదే సమయానికి 85 ఉన్న ఆయిల్ ఇప్పుడు 150 కి చేరింది.